Wednesday, 23 March 2011

నాకు తెలియని ఉత్తమ అమ్మకస్తుడు

మీకు ఎవరికైనా డీజిలు ఎక్కువై ఎప్పుడైనా ఊరికే సరదాకైనా వృధాగా ఒలకబోశారా!
మీకు అలా చెయ్యాలి అనిపించలేదా!
అలా కూడా డీజిలు వాడచ్చొని తెలీదా!
మరేం ఫరవాలేదు! మన ఆర్ టీ సీ వాళ్ళని చూసి నేర్చుకోండి!

అసలు విషయం ఏమిటంటే....

సిటిలొ ఆర్ టీ సీ దాదాపుగ ౩౦౦౦ బుస్సులు నడుపుతుంది. ఐతే ఎన్ని ఏళ్ళ్ళ నుంచి చూసినా మనకి నష్టాలు బాబోయి అని గగ్గోలు పెట్టే సంస్థ అది.
ఇఫ్ఫుడు కొత్తగా జె ఎన్ ఎన్ యు అర్ ఎమ్ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం చాలా బస్సులు సమకూరుస్తోంది. ఇక్కిడి వరకు బాగానే ఉంది.

ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బుస్సుల్లో మార్కొపోలో ఒక రకం. ఐతె వీటి ప్రత్యేకత ఏంటంటే వీటికి గేర్ ఉండదు. అదేనండి మనము చెప్పుకునే ఆటొగేర్ అన్నమాట. ఈ బస్సులో ప్రయాణిస్తుంటే అస్సలు బడలిక తెలీదు సరికదా మబ్బుల్లో తేలుతున్నట్లు ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైందని బుర్ర గోక్కుంటున్నారా!

సమస్యంతా ఇక్కడే ఉంది.

మహా మహా కార్ల కంపెనీలు ఆటొగేర్ బండ్లు తయారు చేసి చేతులు కాల్చుకుని మానుకున్నాయి. ఐతె ఈ మార్కొపోలో బస్సులు మన ఆర్ టే సీ కి ఎవరు అంటగట్టారోగాని మహా మేధావి అయిన అమ్మకస్తుడు అయి ఉంటాడు.

ఈ బండ్లు ఇచ్చే మైలేజి వింటే ఠక్కున ముక్కున వేలు వేసుకుంటారు. ఇంచు మించు వోల్వో బస్సు ఇచ్చే మైలేజి అంటే దాదాపుగా ౩ కి.మి ప్రతి లీటరుకి అన్నమాట. ఆ మాటాకొస్తే వోల్వో కూడ అటోగేర్ కాదు. ఈ మైలేజి అర్ టీ సి కి గోరుచుట్టు మీద రోకలిపోటు లాంటిది. (ఏవరైనా బండి కొనుక్కోవటం తేలిక దానిని భరించటం కష్టం. కాని మనవాళ్ళకి రెండు కష్టమే ఆందుకే పాపం ఈ మాక్కోపోలో పాపం నెత్తిన వేసుకున్నారు. మరి మిగతా రష్ట్రాల సంగతి నాకు ఇప్పటికి తెలీదు).

నా చిన్నప్పుడు బడిలో ఒక ఎత్తిపొడుపు నాటకంలో నాతో వేసిన స్త్రీ పాత్ర ఒక అగ్గిపుల్ల మిగల్చడం కోసం ఒక రోజంతా కిరసనాయిలు పొయ్యి వెలిగి ఉంచుతుంది. చాలా ఏళ్ళకి నాకు ఆ నాటకం ఈ బస్సు వ్యవహారంతో మళ్ళీ గుర్తొచ్చింది. అలాగ ఇప్పుడు మనవాళ్ళు బస్సుకయ్యే ఖర్చు పెట్టలేక ఇదంతా చేస్తున్నారు అనిపించింది.

మామూలు బస్సులు నిండుగా ప్రయాణిస్తే సంస్థకి లాభం. కాని నాకు అనిపించింది ఏంటంటే ఈ ఆటోగేర్ బస్సులు నిండుగా ప్రయాణించినా సంస్థకి వచ్చేది నష్టమే. ఇదంతా ఒక ఎత్తు ఐతే వీటిని మేయిన్టేన్ చెయ్యటం ఒక తెల్ల ఏనుగు పెంపకమే.

అంచేత మరో మూడు నెలలు తిరక్కుండా అర్ టీ సీ బాబోయి మాకు నష్టాలు టిక్కట్టు రేటు పెంచితే కాని మా వల్ల కాదు అంటే కనీస ధర ప్రభుత్వం పది రూపాయలు చేసినా ఆశ్చర్య పోనక్కరలేదు.

No comments: